- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ నేరగాళ్ల ‘చలాన్’ వల.. రూ. 12 లక్షలు పోగొట్టుకున్న జనసేన ఎమ్మెల్యే!
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఆర్టీఏ చలాన్ లింక్ క్లిక్ చేయడంతో ఖాతా నుండి రూ. 12 లక్షలు మాయం. పోలీసులకు ఫిర్యాదు.

దిశ, వెబ్ డెస్క్: సైబర్ నేరగాళ్లు విసిరిన ‘చలాన్’ వలకు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే చిక్కి.. రూ. 12 లక్షలు పొగొట్టుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ చోటు చేసుకోగా.. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Jana Sena MLA Chirri Balaraju) సైబర్ దాడికి గురయ్యాడు. ఒక ఎమ్మెల్యే సైబర్ నేరగాళ్ల వలలో పడి భారీగా నగదు కోల్పోయిన ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే మొబైల్ ఫోన్‌కు ఆర్టీఏ (RTO) చలాన్ చెల్లించాలంటూ ఒక మెసేజ్ వచ్చింది. అందులోని లింక్‌ను ఆయన నిజమేనని నమ్మి క్లిక్ చేశారు. ఆ లింక్ ఓపెన్ చేసిన కొద్దిసేపటికే ఆయన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా రూ. 12 లక్షలు డ్రా అయినట్లు మెసేజ్‌లు రావడంతో ఎమ్మెల్యే షాక్‌కు గురయ్యారు. సైబర్ నేరగాళ్లు (Cyber criminals) పంపిన ఆ నకిలీ లింక్ ద్వారా ఆయన ఫోన్‌ను హ్యాక్ చేసి, క్షణాల్లో ఖాతాను ఖాళీ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఎమ్మెల్యే బాలరాజు (MLA Balaraju) వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు విచారణ వేగవంతం చేశారు. సామాన్యులకే కాకుండా ఏకంగా ప్రజాప్రతినిధులకు ఇటువంటి చేదు అనుభవం ఎదురవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం, అధికారిక సంస్థల పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని, ఇటువంటి మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు ఈ సందర్భంగా ప్రజలను హెచ్చరిస్తున్నారు.






