- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువ సంగ్రామ సదస్సుకు.. 100 కార్లతో కదిలిన జక్క
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న "యువ సంగ్రామ సదస్సు"కు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, యువజన నాయకులు 100 కార్లలో తరలివెళ్లారు.

దిశ, మేడిపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న "యువ సంగ్రామ సదస్సు"కు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, యువజన నాయకులు 100 కార్లలో తరలివెళ్లారు. ర్యాలీని మేడ్చల్ అసెంబ్లీ ఇంచార్జీ రాగిడి లక్ష్మారెడ్డి మాజీ మేయర్ జక్కవెంకట్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ ర్యాలీలో మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, మధుసూదన్ రెడ్డి, కౌడే పోషయ్య, మాజీ జనరల్ సెక్రటరీ ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మనోరంజన్ రెడ్డి, మాజీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొరిపెళ్లి నిర్మల, మాజీ యూత్ విభాగం అధ్యక్షులు ఫైళ్ల ప్రభాకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఆకుల మధుకర్, శ్యామల శ్రీనివాస్, మల్లం వెంకటేష్ గౌడ్, వివిధ డివిజన్ ల అధ్యక్షులు, కార్యదర్శులు, యువనాయకులు, నిరుద్యోగ యువత, అభిమానులు అధిక తరలివెళ్లారు.






