- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిర్ పోర్టులో IPS ఆఫీసర్ లగేజీ చెకింగ్.. బ్యాగులో అది చూసి అంతా షాక్
దిశ, వెబ్ డెస్క్: ఓ ఐపీఎస్ ఆఫీసర్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో..Jaipur airport security found green peas in ips officer bag

X
దిశ, వెబ్ డెస్క్: ఓ ఐపీఎస్ ఆఫీసర్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మొదటగా ఆ ఫొటో చూసి షాకవుతున్నారు. ఆ తర్వాత అవునా.. అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలో ఉన్నత పదవిలో ఓ ఐపీఎస్ ఆఫీసర్ కొనసాగుతున్నారు. అయితే, ఆయన తాజాగా జైపూర్ వెళ్లారు. పని ముగిసిన అనంతరం తిరుగు పయనమయ్యారు. ఈ సమయంలో ఎయిర్ పోర్టులో ఆయన లగేజీని సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు. బ్యాగును ఓపెన్ చేసి చూడగా అందులో కేజీల కొద్దీ పచ్చి బఠాణీ కనిపించింది. అయితే, ఈ విషయాన్ని తానే సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేసి పేర్కొన్నారు. జైపూర్ లో కేజీ బఠాణీ రూ. 40లకే దొరకడంతో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి తీసుకెళ్లినట్టు అందులో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరలవుతోంది.
Next Story






