- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దుబాయ్‌లో కేసులో ఇరుకున్న జగిత్యాల జిల్లా యువకుడు
by Nagaya |

X
దిశ,జగిత్యాల టౌన్ : బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన యువకుడు అనూహ్యంగా అక్కడ ఓ కేసులో ఇరుక్కోని తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. వెంటనే భారత అధికారులు స్పందించి తనను ఇండియాకు తీసుకెళ్లాలని ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండల సిగరావుపేట్ గ్రామానికి చెందిన సల్మాన్ బతుకుదెరువు కోసం కొన్ని నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. దుబాయ్‌లో అనుకోకుండా తప్పుడు కేసులో ఇరుక్కుపోయాడు. దుబాయ్ కోర్టు రూ.37,850 జరిమానాతోపాటు నెల రోజుల జైలు శిక్ష విధించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. వెంటనే ఇండియా ఎంబసీ అధికారులు, తెలుగు అసోసియేషన్ స్పందించి తనను విడిపించాలని వేడుకున్నాడు. కాగా, సల్మాన్‌ను ఎలాగైనా కాపాడాలని జిల్లా ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Next Story