- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబటి రాంబాబుకు YS జగన్ ఫోన్
అంబటి రాంబాబుపై వ్యవహారంపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు. శనివారం సాయంత్రం అంబటి రాంబాబుకు ఫోన్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అంబటి రాంబాబు(Ambati Rambabu)పై వ్యవహారంపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) స్పందించారు. శనివారం సాయంత్రం అంబటి రాంబాబుకు ఫోన్ చేశారు. చంద్రబాబు(Chandrababu) ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు తారాస్థాయికి చేరాయని ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబుకు మొత్తం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ అరాచక పాలనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారని, వాళ్లే సమయం వచ్చినప్పుడు బుద్ధిచెబుతారని అన్నారు. అంబటి రాంబాబు వ్యవహారంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని సీరియస్ అయ్యారు. అంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు రియలైజ్ అయ్యారు. ఇంత పెద్ద వయస్సులో తాను అలా మాట్లాడటం తప్పేనని, టీడీపీ కార్యకర్తల్ని తిట్టి ఉండాల్సింది కాదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. నేను చంద్రబాబును బూతులు తిట్టలేదు. చంద్రబాబును తిట్టాల్సిన అవసరం లేదు. రాజకీయ విమర్శ చేస్తాను. కార్యకర్తలను మాత్రం తిట్టకుండా ఉండాల్సింది. అరెస్టు చేస్తామని బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు. అరెస్టుకు సిద్ధంగా ఉన్నాను. ఈ ఇష్యూలో నాదేం తప్పులేదు.. వాళ్ళు నన్ను తిట్టారు. నేను వాళ్లను తిట్టాను అంతే అని అంబటి పేర్కొన్నారు.






