- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబటి వ్యాఖ్యలు విద్వేషపూరితం.. రాష్ట్రంలో అలజడి సృష్టించే కుట్ర: హోం మంత్రి అనిత
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఈ రోజు గుంటూరులో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) ఈ రోజు గుంటూరులో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూలో జంతుకొవ్వు కలపలేదని నివేదిక రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ (YCP) శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు.. గుంటురులో నిరసన చేపట్టగా టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన ఆయన సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయి పదాలతో రెచ్చిపోయారు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు అంబటి నివాసం వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ వ్యవహారంపై స్పందించిన హోం మంత్రి అనిత (Home Minister Anita) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేత అంబటి రాంబాబు ఉపయోగిస్తున్న భాష అత్యంత జుగుప్సాకరంగా ఉందని, ఆయన మాట్లాడే తీరును కనీసం ఆయన కుటుంబ సభ్యులు కూడా సమర్థించరని రాష్ట్ర హోం మంత్రి అనిత విమర్శించారు. అంబటి తీరుతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆమె శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. "అంబటి రాంబాబు ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించే పన్నాగంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. రాజకీయాల్లో హుందాతనాన్ని విస్మరించి, అధికారులను, ప్రత్యర్థులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని ఆమె హితవు పలికారు.






