సంక్రాంతి కానుకగా చంద్రబాబుకు గిఫ్ట్‌గా గోదావరి: జగదీశ్‌ రెడ్డి

by Gantepaka Srikanth |

సంక్రాంతి కానుకగా గోదావరిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అప్పగించారు మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.

సంక్రాంతి కానుకగా చంద్రబాబుకు గిఫ్ట్‌గా గోదావరి: జగదీశ్‌ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సంక్రాంతి కానుకగా గోదావరిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అప్పగించారు మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ముందు నుంచి అనుకున్నట్టే గోదావరిని ఏపీకి కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. కోర్టులకు లాయర్లు వెళ్తారు కానీ.. మంత్రులు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నదో మంత్రులకు తెలియదని.. శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వరాని వాళ్లు కోర్టుకు వెళ్తున్నారని ఎద్దేవాచేశారు. చంద్రబాబునాయుడు డైరెక్షన్‌లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని.. బలహీనమైన పిటిషన్ చెల్లదని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే గోదావరి, కృష్ణా జలాలను తాకట్టు పెడుతున్నారని పేర్కొన్నారు. ఏపీ సీఎంకు సమయం ఇచ్చేందుకు తప్పుడు పిటిషన్ వేశారని.. హంగు ఆర్భాటంగా సుప్రీంకోర్టుకు వెళ్లిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బయటకు వచ్చే ముందు మొహం చూయించకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ చర్చ చేయకుండా కోర్టుకు ఎళా వెళ్తారని నిలదీశారు. చంద్రబాబుకు చెవిలో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ ఆపమని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు.

బీజేపీ నుంచి రక్షణ

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని ఉత్తర కుమార్‌రెడ్డి చేసేందుకే సుప్రీంకోర్టుకు రేవంత్‌రెడ్డి పంపించారని.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనుమతిపై మాత్రం ఢిల్లీకి పోవడం లేదని అన్నారు. బీజేపీ నుంచి రక్షణ పొందడానికే ఈ చీకటి ఒప్పందం అని.. కేసులను కాపాడుకుందుకు కృష్ణ, గోదావరి జలాలను అప్పజెప్పుతున్నారని పేర్కొన్నారు. దొంగల చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని అన్నారు. తెలంగాణ ప్రజల్ని కాపాడుకునేందుకు కేసీఆర్ ఉన్నారని.. రాష్ట్ర హక్కులను కాపాడుతామని అన్నారు. రేవంత్‌రెడ్డికి ప్లాట్ల దందా తప్ప మరోకటి తెలియదని.. ఏ శాఖలో ఏం జరుగుతుందో మంత్రులకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్, కె.కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.

Next Story