- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీనేజ్‌లో మొదలుపెట్టి.. ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్న నటి
దిశ, సినిమా :Jacqueline Fernandez reveals she punished herself for eating in her 20s

దిశ, సినిమా : శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫేమస్ యాక్ట్రెస్‌గానే కాకుండా బాలీవుడ్ ఫిట్టెస్ట్ స్టార్స్‌లో ఒకరిగా పేరు పొందింది. ఇందుకోసం హెల్తీ డైట్ నుంచి ఎక్సర్‌సైజ్ వరకు అన్ని రకాల టిప్స్ పాటించే జాక్వెలిన్.. శిల్పా శెట్టి 'షేప్ ఆఫ్ యు' షో ద్వారా తన ఫుడ్ హ్యాబిట్స్ మూలంగా టీనేజ్‌లో ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడించింది.
ఆ వయసులో తినకుండా తనను తాను శిక్షించుకున్న విషయాలను పంచుకుంది. 'ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆహారపు అలవాట్లను మార్చుకుంటారా?' అని శిల్పా శెట్టి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. '20 ఏజ్‌లో నేను చాలా వరకు ఈటింగ్ ఇష్యూస్ ఎదుర్కొన్నాను. 19 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ వేదికపై కనిపించాలనే ఆరాటమే తప్ప దాన్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలియదు. అదే టైమ్‌లో నాకు ఆహారం శత్రువుగా మారింది. ఇప్పుడు యాక్టర్ అయ్యాక కూడా అదే కంటిన్యూ అవుతోంది' అని చెప్పుకొచ్చింది.






