- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rocking Rakesh : KCR సినిమా టికెట్స్ అమ్ముతున్న జబర్దస్త్ నటుడు
ఇప్పుడు, ఆ లిస్టులో జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ( Rocking Rakesh ) కూడా చేరిపోయారు.

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్యకాలంలో జబర్దస్త్ నటులు సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. సుడిగాలి సుధీర్ , గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్, బలగం వేణు ఇప్పటికే పలు సినిమాలు చేసి సినిమాలు చేసి మంచి విజయం సాధించారు.
తాజాగా, ఆ లిస్టులో ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ( Rocking Rakesh ) కూడా చేరిపోయారు. హీరోగా పరిచయం అవుతూ KCR (కేశవ చంద్ర రమావత్) సినిమా చేశాడు. ఈ సినిమాలో హీరోగానే కాకుండా నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నాడు.
గరుడవేగ అంజి దర్శకత్వంలో ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన కేసీఆర్ మూవీలో సీనియర్ నటి సత్య కృష్ణన్ కూతురు అన్నన్య కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే, ఈ సినిమా మొదటి టికెట్ తానే అమ్మిన వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసాడు జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్. టికెట్స్ తీసుకుంటున్న ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాడు. మరి, ఈ మూవీతో హీరోగా సక్సెస్ అందుకుంటాడో? లేదో చూడాల్సి ఉంది.






