- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Satya Sri : సొంతింట్లోకి అడుగుపెట్టిన జబర్దస్త్ నటి సత్యశ్రీ.. వైరల్ అవుతున్న ఫొటోలు
ఇప్పుడు ఓ వైపు టీవీ షోలు, ఇంకో వైపు సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉంది సత్యశ్రీ.

దిశ, వెబ్ డెస్క్ : జబర్దస్త్ తో మంచి గుర్తింపు పొందిన సత్యశ్రీ ( Satya Sri ) మనందరికీ సుపరిచితమే. జబర్దస్త్ స్కిట్స్ లో నటించి పలు ఈవెంట్స్, సినిమాలు కూడా చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు, ఓ వైపు టీవీ షోలు, ఇంకో వైపు సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉంది సత్యశ్రీ. తాజాగా, సత్యశ్రీ ఒక కొత్త ఇల్లు గృహ ప్రవేశం చేసింది. తన సొంతూరైన తణుకులో ఈ ముద్దుగుమ్మ కొత్త ఇల్లు కట్టుకుంది.
తన ఇంటి గృహ ప్రవేశం ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ విషయాన్ని చెబుతూ " ఇది ఇల్లు కాదు నా కల. కొత్త ఇల్లు, కొత్త ప్రారంభం, కొత్త జ్ఞాపకాలు. సొంతూరు తణుకులో నేను కట్టించుకున్న సొంత ఇల్లు " అంటూ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు, బుల్లితెర ప్రేక్షకులు సత్యశ్రీ కు విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం, సత్యశ్రీ గృహ ప్రవేశం ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






