ఒకే చెట్టుకు 8 రకాల పండ్లు.. 'ఫ్రూట్ సలాడ్' స్పెషల్!

by Dishanational1 |
ఒకే చెట్టుకు 8 రకాల పండ్లు.. ఫ్రూట్ సలాడ్ స్పెషల్!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఒక చెట్టుకు ఒకే రకమైన కాయలు కాస్తాయి. కానీ ఒకే సమయంలో 8 విభిన్న రకాల ఫలాలను ఉత్పత్తిచేసే చెట్టుగా 'ఫ్రూట్ సలాడ్' ప్రసిద్ధి పొందింది. 1990 ప్రారంభంలో ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్, కెర్రీ వెస్ట్‌ పలు ప్రయత్నాలు చేసి 'ఫ్రూట్ సలాడ్' చెట్టుకు ప్రాణం పోశారు. ఇది నిమ్మ, నారింజ, యాపిల్స్ వంటి ఒకే జాతికి చెందిన పండ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇలా మొట్టమొదటి ఫ్రూట్ సలాడ్ చెట్టు ఆస్ట్రేలియాలో పెరిగినప్పటికీ.. కాలక్రమేణా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది.

ప్రధానంగా నాలుగు రకాల ఫ్రూట్ సలాడ్ చెట్లు ఉండగా.. ప్రతీది వివిధ రకాల పండ్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఫ్రూట్ సలాడ్ చెట్లకు 'సిట్రస్, స్టోన్ ఫ్రూట్, మల్టీ యాపిల్, మల్టీ నాషి' అని నామకరణం చేశారు. ఇలా పేరును బట్టి ఏ చెట్టు ఏ ఫలాలనిస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు : మల్టీ నాషి ట్రీ అనేది పలు రకాల ఆసియా బెర్రీస్ ఉత్పత్తిచేసే సలాడ్ చెట్టు. ఇక మల్టిపుల్-యాపిల్ చెట్టు‌.. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగు ఆపిల్స్‌ అందిస్తోంది. స్టోన్ ఫ్రూట్ చెట్టు రేగు, ఆప్రికాట్స్, పీచెస్, నెక్టరైన్ల కలయికకు ప్రసిద్ధి చెందింది. సిట్రస్ ఫ్రూట్ సలాడ్ విషయానికొస్తే.. ఇది నారింజ, నిమ్మ, మాండరిన్స్, ద్రాక్ష వంటి పండ్లను అందిస్తోంది.

పెంచే ప్రక్రియ :

ముందుగా మొక్కను నీటి బకెట్‌లో రాత్రంతా నానబెట్టి ఆ తర్వాత భూమిలో నాటుకోవాలి. ఇలా చేస్తే వేర్లు ఉత్తమంగా వ్యాప్తి చెందుతాయి. వాడే మట్టి రకాన్ని బట్టి దానికి కంపోస్ట్ లేదా జిప్సం కలపాలి. ప్రతి 6 నెలలకు చెట్టు ఫలదీకరణం చేయబడుతుందనే విషయాన్ని గుర్తంచుకోవాలి. తర్వాత నేలలోని తేమను కాపాడేందుకు ట్రీ మల్చింగ్ చేయబడుతుంది. ఈ ఫ్రూట్ సలాడ్ చెట్టు నుంచి మొదటి ఫ్రూట్ సలాడ్‌ను చూసేందుకు దాదాపు 9-18 నెలల సమయం పడుతుంది. దీని పెంపకానికి తోట/టెర్రస్ ప్రాంతాన్ని ఉపయోగించవచ్చు. కానీ ఈ చెట్టుపై వివిధ జాతుల పండ్లను పెంచలేకపోవడం డిస్‌అడ్వాంటేజ్. ఉదా: యాపిల్, అరటి లేదా స్టోన్ ఫ్రూట్స్‌ను కలిసి పండించలేరు.


Next Story

Most Viewed