- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Itching: ఈ ప్రాంతాల్లో దురద.. ఈ వ్యాధులు తలెత్తే అవకాశం..?
శరీరంలోని కొన్ని భాగాల్లో తరచూ దురద వస్తుంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: శరీరంలోని కొన్ని భాగాల్లో తరచూ దురద(Itching) వస్తుంటుంది. కానీ చాలా మంది ఈ సమస్యను విస్మరిస్తుంటారు. కొన్ని సార్లు దురద వెంటనే తగ్గిపోయినప్పటికీ.. కొన్నిసార్లు తీవ్రమైన వ్యాధికి సంకేతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దురద పలు చోట్ల ఎక్కువ కాలం కొనసాగితే అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
తలపై దురద ఎక్కువ కాలం ఉన్నట్లైతే..చుండ్రు(dandruff) ఉందేమోనని అనుకుంటారు. కానీ పేను, తామర వంటి స్కిన్ ప్రాబ్లమ్స్(Skin problems) కు కూడా సంకేతమని గుర్తించాలి. అలాగే అరికాళ్లలో దురద(Itchy soles), అరచేతుల్లో దురదగా ఉన్న చిరాకుగా ఉంటుంది. ఇది కాలేయ(liver), మధుమేహ సమస్యల(Complications of diabetes)కు దారితీస్తుంది. కాగా అరికాళ్లలో దీర్ఘకాలిక దురద ఉన్నట్లైతే వైద్యుల్ని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే ప్రైవేటు భాగాల్లో దురద వస్తే బ్యాక్టీరియా(Bacteria), ఫంగస్.. కొన్ని సోప్స్, బట్టలు లేదా పలు వస్తువుల కారణంగా లెర్టీ దురదను కలిగిస్తుంది. తామర వంటి సమస్యలు కూడా ప్రవైటు భాగాల్లో దురదను కలిగిస్తాయి. పుట్టు మచ్చపై దురద వస్తే చర్మ క్యాన్సర్ కు సంకేతమని, శరీరం అంతటా వస్తే కాలేయ వ్యాధి, మూత్ర పిండాల వ్యాధి, థైరాయిడ్(Thyroid), క్యాన్సర్(Cancer), ఆసన ప్రాంతంలో దురద పైల్స్(Piles) అని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ లక్షణాలు కనిపిస్తే కనుక డాక్టర్ ను అప్రోచ్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






