ఓటరు జాబితా పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : డా. గంగిడి మనోహర్ రెడ్డి

by Batti.Sumithra |

ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితా అత్యంత కీలకమైనదని, ప్రతి పోలింగ్ బూత్‌లో బీజేపీ కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డా. గంగిడి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఓటరు జాబితా పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : డా. గంగిడి మనోహర్ రెడ్డి
X

దిశ, దేవరకొండ టౌన్ : ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితా అత్యంత కీలకమైనదని, ప్రతి పోలింగ్ బూత్‌లో బీజేపీ కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డా. గంగిడి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం దేవరకొండ నియోజకవర్గ బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం పై అసెంబ్లీ స్థాయి సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిలు మాట్లాడుతూ ఓటరు జాబితా పవిత్రతను కాపాడటం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటమేనని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు. అదే సమయంలో నకిలీ నమోదులు, అనర్హుల పేర్లు, ఓటర్ల జాబితాలో జరిగే అక్రమాలను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బీజేపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణల పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కేతావత్ లాలు నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు వానం నరేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకురి నరసింహ, సీనియర్ నాయకులు బెజవాడ శేఖర్, నక్క వెంకటేష్, చెనమొని రాములు, వనం పుష్పలత, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు వినోద్ రాథోడ్, వనం సుజాత, వస్కుల సుధాకర్, సముద్రాల నగేష్, నాగిళ్ల ఆంజనేయులు, వినోద్ చారి, రాము నాయక్ పాల్గొన్నారు. వీరితో పాటు నియోజకవర్గంలోని వివిధ మండల, పట్టణ, శక్తి కేంద్ర, బూత్ కమిటీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రతి బూత్‌లో SIR కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తీర్మానించారు.

Next Story