త్వరలో మరో "స్కైలాబ్" ఘటన.. ఈసారి సగం భూమి ఖతం!!

by Muthe.Rajitha |

మీలో చాలామందికి "స్కైలాబ్" ఘటన తెలిసే ఉంటుంది.

త్వరలో మరో స్కైలాబ్ ఘటన.. ఈసారి సగం భూమి ఖతం!!
X

దిశ, వెబ్ డెస్క్ : మీలో చాలామందికి "స్కైలాబ్" ఘటన తెలిసే ఉంటుంది. 1974లో ప్రయోగించబడిన స్కైలాబ్ ఉపగ్రహం.. 1979లో విఫలం అయ్యి భూమి మీద కుప్పకూలింది. స్కైలాబ్ కూలి మీద పడి చనిపోతామని భారత్ సహా అనేక దేశాల్లోని ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రాణాల మీద ఆశలు వదిలేసుకొని.. ఆ కొద్ది రోజులు నచ్చింది తింటూ, బంధువులతో గడుపుతూ.. ఓ వైపు మృత్యువు తరుముకొస్తుందనే భయంతో ఏడుస్తూ.. మరణం ఎప్పుడో ఒకసారి రావాల్సిందే కదా అనే ఫిలాసఫీతో సంతోషంగా గడిపారు. చివరికి శాస్త్రవేత్తలు అతికష్టం మీద దానిని హిందూ మహా సముద్రంలో పడేలా చేయడంతో.. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే తాజా అంతరిక్ష సమాచారం ప్రకారం భూమి మీద మరో స్కైలాబ్ లాంటి ఘటన జరగబోతున్నట్టు తెలుస్తోంది. శాస్త్రవేత్తలు ఖగోళ ప్రయోగాలు నిర్వహించే అంతరిక్ష పరిశోధనా సంస్థ త్వరలోనే భూమి మీద పడనుంది. అయితే అది మరో స్కైలాబ్ అవుతుందా? మృత్యువు మరోసారి తరుముకు రానుందా? ఈసారి నిజంగానే భూమికి పెను ప్రమాదం తప్పదా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయా? అయితే కూలిపోనున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) గురించి నాసా ఏం చెబుతోందో తెలుసుకుందా.

నాసా ఏం చెబుతోంది??

దీర్ఘకాలంగా పనిచేయడం వలన, ఆయుష్షు ముగిసి ISS లోని చాలా భాగాలు పనిచేయడం లేదని, 2030 నాటికి ISS కు పూర్తి రిటైర్మెంట్ ఇస్తున్నట్టు నాసా తెలియజేసింది. అమెరికా, రష్యా, యూరప్, జపాన్, కెనడా దేశాల అంతరిక్ష సంస్థలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ఈ బాధ్యతను ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు అప్పగించారు. అయితే 2030 వరకు ISS వాడకాన్ని కొద్దికొద్దిగా తగ్గిస్తూ.. చివరికి పూర్తిగా నిలిపివేసి, తొలగిస్తారు. ఇందుకోసం స్పేస్ ఎక్స్ ఇప్పటికే పనులు మొదలు పెట్టిందని సమాచారం.

ఎలా తొలగిస్తారంటే?

ISSను భూమి వాతావరణంలోకి నెమ్మదిగా తీసుకొచ్చి, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో చాలా దూరంగా ఉన్న 'నీమో పాయింట్' కేంద్రంలో పడేలా చేస్తారు. ఈ ప్రాంతంలో జనాలు అసలే ఉండరు. నౌకలు కూడా అరుదుగా వెళ్తాయి. భూమి వాతావరణంలోకి వచ్చేటప్పుడు ISSలోని ఎక్కువ భాగం కాలిపోయి నశిస్తుంది. మిగిలే చిన్న ముక్కలు సముద్రంలో పడతాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదని నాసా చెబుతోంది. ఈ పని కోసం నాసా స్పేస్‌ ఎక్స్ కంపెనీకి ప్రత్యేక బాధ్యతనుఇచ్చింది. ISSను సురక్షితంగా భూమి వైపు తీసుకురావడానికి ఒక ప్రత్యేక వాహనం తయారు చేస్తున్నారు. దీని కోసం దాదాపు 832 బిలియన్ డాలర్ల డబ్బు ఖర్చు చేస్తున్నారు.

ISS ప్రస్థానం..

1998లో మొదలైన ISS 25 ఏళ్లకు పైగా అంతరిక్షంలో ఉంది. కానీ ఇప్పుడు దీని ప్రధాన నిర్మాణం పాతబడింది. అంతరిక్షంలో వేడి–చలి మార్పులు, ఇతర స్పేస్ షిప్‌లు వచ్చి వెళ్లడం వల్ల ఒత్తిడి పెరిగింది. ఇక దీన్ని ఎక్కువ కాలం వినియోగించడం సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి అంతరిక్ష ప్రమాదం జరగక ముందే తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.

అంతరిక్ష పరిశోధనలు ఆగినట్టేనా?

అయితే ISS ని తొలగిస్తే అంతరిక్ష పరిశోధనలు ఆగిపోవు. భవిష్యత్తులో ప్రైవేట్ కంపెనీలు కొత్త అంతరిక్ష కేంద్రాలు తీసుకొస్తున్నాయి. అక్కడే మళ్లీ ప్రయోగాలు, మనుషుల నివాసం కొనసాగుతుంది. అంటే ISSతో ఒక దశ ముగిసి, కొత్త దశ మొదలవుతోంది. ఇది కేవలం అంతరిక్ష భద్రత కోసం ముందస్తుగా తీసుకుంటున్న చర్యలుగా భావించాలి. అంతేగాని "స్కైలాబ్" ఘటనలా భయపడాల్సిన అవసరం లేదు.

Next Story