- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇజ్రాయెల్ PM బెంజమిన్ నెతన్యాహు మృతి..?
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతి చెందారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి

దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. అయితే బెంజమిన్ నెతన్యాహు మరణించారని, ఆయన భౌతికకాయాన్ని అంబులెన్స్‌లోకి తరలిస్తున్నారంటూ ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపిస్తోంది. అంతేకాదు ఆయన ప్రసంగిస్తున్న తాజా వీడియోలో ఒక చోట ఆయన చేతికి ఆరు వేళ్లు కనిపిస్తుండటంతో, ఇది అసలైన నెతన్యాహు కాదని, కేవలం 'AI' సృష్టించిన వీడియో అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెతన్యాహు ఇప్పటికే మరణించారని, ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆయన మరణ వార్తను గోప్యంగా ఉంచి ఇలా ఏఐ వీడియోలతో ప్రజలను నమ్మిస్తోందని అంతర్జాతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. ఇజ్రాయెల్ ప్రభుత్వం కానీ, అక్కడి ప్రధాన వార్తా సంస్థలు కానీ నెతన్యాహు మృతి చెందినట్లు ప్రకటించలేదు. అయితే ఆ వీడియోలో ఉన్న 'ఆరు వేళ్లు' అనేది అది AI సృష్టించిన వీడియో అనడానికి బలమైన సాక్ష్యంగా నిలుస్తోందే తప్ప, అది మరణ వార్తను ధృవీకరించినట్టు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.






