‘నిర్భయ’ గ్యాంగ్‌రేప్ ఆధారంగా సినిమా.. ఇజ్రాయెల్‌ డైరెక్టర్ సంచలన ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-13 10:53:34  IST  )

‘నిర్భయ’ (Nirbhaya) గ్యాంగ్ రేప్ ఘటన యావత్ భారతదేశాన్ని శోకసంద్రంలో ముంచేసిన విషయం తెలిసిందే.

‘నిర్భయ’ గ్యాంగ్‌రేప్ ఆధారంగా సినిమా.. ఇజ్రాయెల్‌ డైరెక్టర్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నిర్భయ’ (Nirbhaya) గ్యాంగ్ రేప్ ఘటన యావత్ భారతదేశాన్ని శోకసంద్రంలో ముంచేసిన విషయం తెలిసిందే. కామాంధుల చేతిలో దేశ రాజధాని నగరంలో జరిగిన ఆ ఉన్మాదాన్ని మహిళలు ఎవరూ మరువలేదు. ఈ నేపథ్యంలోనే ‘నిర్భయ’ గ్యాంగ్‌రేప్ ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా ఇజ్రాయెల్ ప్రముఖ దర్శకుడు డ్యాన్ వోల్మన్ (Dan Wolman) సంచలన ప్రకటన చేశాడు. ఆ మూడీకి ‘మర్డర్స్ టూ క్లోజ్, లవ్ టూ ఫార్’ (Murders Too Close, Love Too Far) అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశాడు. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, ఆ తర్వాత దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన అపూర్వమైన ప్రజా నిరసనలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నట్లుగా తెలుస్తోంది.

అయితే, నిర్భయ ఘటన జరిగిన సమయంలో డ్యాన్ వోల్మన్ భారత్‌లోనే ఉన్నారని తాను వెల్లడించారు. నాటి సామాజిక ఉద్రిక్తతలు, ప్రజల ఆవేదనను ఆయన స్వయంగా ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఆ భావోద్వేగాలనే వెండితెరపై ఆవిష్కరించాలనే తాను నిర్ణయం తీసుకున్నట్లుగా డ్యాన్ వోల్మన్ స్పష్టం చేశాడు. ‘మర్డర్స్ టూ క్లోజ్, లవ్ టూ ఫార్’ మూవీని ప్రముఖ అస్సామీ దర్శకురాలు మంజు బోరా (Manju Bora)తో కలిసి డ్యాన్ వోల్మన్ తెరకెక్కించబోతున్నారు. ఇందులో సీమా బిశ్వాస్, ఆదిల్ హుస్సేన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కామాంధుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఓ యువతికి, ఆమె కోసం పోరాడిన కోట్లాది మంది భారతీయులకు ఈ సినిమా ఒక నివాళిగా నిలుస్తుందని సినిమా ప్రియులు అంటున్నారు.

Next Story