- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 254 కు చేరిన మృతుల సంఖ్య
అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా - ఇరాన్ మధ్య 14 రోజుల కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బుధవారం ఇజ్రాయెల్ చేసిన ఆకస్మిక ఎయిర్ స్ట్రైక్స్ ఫలితంగా లెబనాన్ లో మృతుల సంఖ్య 254 కు చేరుకుంది. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే 100కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం యుద్ధ తీవ్రతకు అద్దం పడుతోంది. లెబనాన్ సివిల్ డిఫెన్స్ గణాంకాల ప్రకారం.. ఈ దాడుల్లో 254 మంది మరణించగా, మరో 1,165 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా రాజధాని బీరూట్‌లోని రద్దీగా ఉండే నివాస ప్రాంతాలు, టైర్ (Tyre) నగరం, సిడాన్ (Sidon) ఓడరేవు ప్రాంతం, బెకా వ్యాలీ (Bekaa Valley) లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఒక అంత్యక్రియల ఊరేగింపుపై కూడా దాడి జరగడం అత్యంత విషాదకరమైన విషయంగా నిపుణులు పరిగణిస్తున్నారు.
కాగా అమెరికా-ఇరాన్ ఒప్పందంలో భాగంగా "లెబనాన్‌పై దాడులు ఆపాలి" అనే షరతు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఉల్లంఘించారు. ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ హిజ్బుల్లాపై తమ పోరాటానికి వర్తించదని ఆయన స్పష్టం చేశారు. ముందుస్తు హెచ్చరికలు లేకుండానే జనసాంద్రత గల ప్రాంతాలపై క్షిపణులు వర్షం కురిపించడంతో ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ దాడుల అనంతరం హార్మూజ్ జలసంధిని ఇరాన్ మరోసారి మూసివేసిందనే వార్తలు వెలువడుతున్నాయి.






