- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసిస్ సానుభూతిపరుడి అరెస్ట్: సోషల్ మీడియా నిఘా లో దొరికిన నిందితుడు
ఐసిస్ భావజాలం ప్రచారం చేస్తున్న వ్యక్తి కచ్‌లో అరెస్ట్! సోషల్ మీడియా పర్యవేక్షణ ద్వారా నిందితుడిని పట్టుకున్న ఎస్‌ఓజీ పోలీసులు.

దిశ, వెబ్ డెస్క్: గత కొంతకాలంగా భారత దేశంలోని వివిధ రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారు, సానుభూతి పరులు పట్టు పడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఏదో ఒక ప్రాంతంలో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఐసిస్ సానుభూతి పరుడిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని భుజ్ సమీపంలో గల లోదాయ్ గ్రామానికి చెందిన ఫకీర్ మహ్మద్ ఇషాక్ గగ్డాను కచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఐసిస్ తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నాడనే ఆరోపణలపై స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) ఈ చర్య చేపట్టింది.
పోలీసుల ప్రకటన
కచ్ ఎస్పీ వికాస్ సుండా ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభమైనప్పటి నుండి, కచ్ పోలీసులు హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లను నిరంతరం బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా సరిహద్దు భద్రత కు అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి సోషల్ మీడియా నిఘాను ముమ్మరం చేశారు. ఈ నిఘా ప్రక్రియలో భాగంగానే నిందితుడి గురించి ఎస్‌ఓజీ బృందానికి కీలక సమాచారం అందింది. నిందితుడు లోధియాకు చెందిన 32 ఏళ్ల ఫకీర్ మహ్మద్ ఇషాక్ గగ్డా అని పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.






