మరోసారి రెచ్చిపోయిన ఇషాన్ కిషన్. 42 బంతుల్లో సెంచరీ

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-31 14:59:48  IST  )

టీమిండియా యంగ్ ప్లేయర్ మరోసారి న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశారు.

మరోసారి రెచ్చిపోయిన ఇషాన్ కిషన్. 42 బంతుల్లో సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యంగ్ ప్లేయర్ మరోసారి న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. కేరళలోని తిరువనంతపురం వేదికగా భారత్ - కివిస్(India vs New Zealand) మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో వికెట్‌గా బరిలోకి వచ్చిన ఇషాన్ కిషన్(Ishan Kishan) ఎక్కడా అవకాశం ఇవ్వకుండా రెచ్చిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి. కిషన్ తోపాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అదరగొట్టారు. 30 బంతుల్లో 63 పరుగులు చేశారు. ఇందులో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సులు ఉన్నాయి. ప్రస్తుతం 17 ఓవర్లు పూర్తయ్యాయి. రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 234 పరుగులు చేసింది.

Next Story