Ilaiyaraaja: రాజ్యసభ సభ్యుడిగా సంగీత దర్శకుడు ఇళయరాజా ?

by S Gopi |   (  Updated:2022-04-19 07:02:04  IST  )

దిశ, వెబ్ డెస్క్: మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా రాజ్యసభకు నామినేట్‌ చేసేందుకు రంగం సిద్ధమైందని..Is Music Director Ilaiyaraja being nominated to Rajya Sabha?

Ilaiyaraaja: రాజ్యసభ సభ్యుడిగా సంగీత దర్శకుడు ఇళయరాజా ?
X

దిశ, వెబ్ డెస్క్: మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా(Ilaiyaraaja) రాజ్యసభకు నామినేట్‌ చేసేందుకు రంగం సిద్ధమైందని అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ వర్గాల్లోనూ జోరుగా ప్రచారం జరుగుతుంది. రాష్ట్రపతి సాహిత్య, సంగీత, ఆర్ధిక, వైజ్ఞానిక రంగాలకు సంబంధించిన ప్రముఖులను రాజ్యసభకు నేరుగా నామినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్రపతి రాజ్యసభ సభ్యులుగా 12 మందిని నామినేట్ చేయనున్నారు. ఆ కోటాలనే ఆరేళ్ల కిందట మోడీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. అయితే, ఇళయరాజాను(Ilaiyaraaja) కూడా రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నియమించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమనేది తెలవాల్సి ఉంది.

Next Story