మున్సిపాలిటీ బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు..

by Batti.Sumithra |

కామారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

మున్సిపాలిటీ బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు..
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 1వ వార్డ్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, 21వ వార్డ్ కౌన్సిలర్ తాటి లావణ్య ప్రసాద్, 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షితలు మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, అకౌంటెంట్ రాములు తీరుపై ఫిర్యాదు చేశారు.

కమిషన్ తీసుకొని బిల్లులు రాస్తున్నారని ఆరోపణ..

బిల్లుల చెల్లింపులో ప్రస్తుత కమిషనర్, అకౌంటెంట్ లు కమిషన్ తీసుకొని, పర్సెంటేజ్ వసూలు చేసి బిల్లులు పాస్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజిలెన్స్ ఆరోపణలు ఉన్న బిల్లులను కూడా అక్రమంగా రాస్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీలో ఇష్టానుసారంగా అధికారులు బిల్లులు అందిస్తున్నారని కౌన్సిలర్లు పేర్కొన్నారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు..

ఈ మేరకు సీఎంఓ (MA&UD), రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సీడీఎంఏ డైరెక్టర్, జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)లకు ఫిర్యాదు అందజేశారు.

సమగ్ర విచారణ కోరిన కౌన్సిలర్లు..

శానిటేషన్, వాటర్ వర్క్స్, జనరల్ ఫండ్, 14వ, 15వ ఫైనాన్స్, స్పెషల్ డెవలప్‌మెంట్ బిల్లుల చెల్లింపులపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. విచారణ పూర్తయ్యే వరకు బిల్లుల చెల్లింపులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.

Next Story