హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. IRGC నౌకాదళం సంచలన ప్రకటన

by Malleboina Mahesh |

హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నౌకాదళం కీలక ప్రకటన! సముద్ర మార్గాలపై నియంత్రణ బలోపేతం చేస్తున్నట్లు వెల్లడి. ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం.

హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. IRGC నౌకాదళం సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో తమ నియంత్రణను మరింత బలోపేతం చేస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నౌకాదళం ప్రకటించింది. ఈ కీలక సముద్ర మార్గాల్లో కొత్త సమీకరణాలు, నిబంధనలను సిద్ధం చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని IRGC స్పష్టం చేసింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదవ వంతు ఈ మార్గం గుండానే జరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ చేస్తున్న ఈ హెచ్చరికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

పూర్తి నియంత్రణ

పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధిలో తమ పర్యవేక్షణను మునుపటి కంటే మరింత ముమ్మరం చేస్తామని IRGC తెలిపింది. ఈ సముద్ర మార్గాల గుండా ప్రయాణించే విదేశీ నౌకలు, యుద్ధ నౌకలకు సంబంధించి కొత్త ప్రోటోకాల్స్ సిద్ధమయ్యాయని పేర్కొంది. ఇరాన్ సుప్రీం లీడర్ నిర్దేశించిన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడమే తమ ప్రాధాన్యత అని నౌకాదళం వెల్లడించింది. కాగా పరిణామాలపై ప్రపంచ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Next Story