- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్ గడువు పొడిగించాలి.. ఎన్నికల అధికారిని కలిసిన బీఆర్ఎస్ బృందం
ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమయం సరిపోదని.. ఎస్ఐఆర్ గడువు పొడిగించాలని.. ఇప్పటికే ఈ విషయం చెప్పినా స్పందన లేదని బీఆర్ఎస్ నేతలు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమయం సరిపోదని.. ఎస్ఐఆర్ గడువు పొడిగించాలని.. ఇప్పటికే ఈ విషయం చెప్పినా స్పందన లేదని బీఆర్ఎస్ నేతలు అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ ఎస్ఐఆర్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు కర్నె ప్రభాకర్, ఎల్.రమణ, సుమిత్రానంద్, సతీష్‌రెడ్డి, అభిలాష్ రంగినేని కలిశారు. రాష్ట్రంలో సర్ కార్యక్రమం జరుగుతున్నా.. బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్నారు. టెక్నికల్‌గానూ కొన్ని అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
ఇది వరకే సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారని.. తమ పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశామని చెప్పారు. కానీ.. వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అనేక పిటిషన్లు ఉన్నాయని.. వీటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. ఓటర్ల విషయంలోనూ అనేక చిక్కులు ఉన్నాయని.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కచ్చితంగా గడువు పొడిగించి, ఇచ్చిన పిటిషన్లు పరిష్కరించాలని సూచించారు.






