- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pavan Kalyan: ముద్రగడ మరణ వార్త.. డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇదే!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Pradmanabham) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ వార్త విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) స్పందించారు. ముద్రగడ పద్మనాభం మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లుగా ఓ ప్రకటనలో తెలిపారు. ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా పవన్ గుర్తుచేసుకున్నారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం, తన సామాజిక వర్గ హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు రాజకీయాల్లో చెరగని ముద్ర వేశాయని పవన్ అన్నారు. ముద్రగడ పద్మనాభం అకాల మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, ఆయన అనుచరులు, మద్దతుదారులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.






