నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం దారుణాలు!

by Muthe.Rajitha |

ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన భారీ ఆందోళనల్లో పాల్గొన్న వారిపై ఖమేనీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం దారుణాలు!
X

దిశ, వెబ్ డెక్స్ : విదేశీ శక్తులకు అనుకూలంగా పనిచేసిన వారిని వదిలిపెట్టేది లేదని, కఠిన శిక్షలు తప్పవని ఇరాన్‌ అధ్యక్షుడు ఖమేనీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన భారీ ఆందోళనల్లో పాల్గొన్న వారిపై ఖమేనీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. వేలాది మంది నిరసనకారులను అరెస్టు చేసి నిర్బంధ కేంద్రాలకు తరలించగా.. వారితో దారుణంగా వ్యవహరిస్తున్నట్టు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేసాయి.

అరెస్టు చేసిన వారిలో వందల మందికి మరణశిక్ష విధించాలనే ప్రయత్నాలు చేయగా.. అంతర్జాతీయ ఒత్తిడితో వాటిని కొంతవరకు ఆపినట్లు సమాచారం. అయినా జైళ్లలో బందీలను నగ్నంగా నిలబెట్టి చల్లని నీళ్లు పోయడం, ఏవేవో ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతోందని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు నిర్బంధ కేంద్రాలకు తీసుకెళ్లే సమయంలో మహిళా నిరసనకారులతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని మానవ హక్కుల సంస్థల ఆరోపిస్తున్నాయి.

ఇప్పటివరకు జరిగిన నిరసనల్లో సుమారు 5 వేల మందికి పైగా పౌరులు, 500 మంది భద్రతా సిబ్బంది మరణించినట్లు ఇరాన్ చెబుతుండగా.. మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్ లో జరుగుతున్న ఈ పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story