రెండు భారీ వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకున్న ఇరాన్.. వీడియో రిలీజ్

by Muthe.Rajitha |

ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ హార్మూజ్ జలసంధిలో రెండు భారీ వాణిజ్య నౌకలపై దాడి చేసి, స్వాధీనం చేసుకుంది.

రెండు భారీ వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకున్న ఇరాన్.. వీడియో రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్ : హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ హార్మూజ్ జలసంధిలో (Strait of Hormuz) రెండు భారీ వాణిజ్య నౌకలపై దాడి చేసి, స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు IRGC ఓ వీడియో కూడా విడుదల చేసింది. బుధవారం పనామా జెండాతో వెళ్తున్న MSC Francesca, Epaminondas అనే కంటైనర్ షిప్పులను ఇరాన్ దళాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. మరో నౌకపై కూడా కాల్పులు జరిపినప్పటికీ దానిని స్వాధీనం చేసుకోలేదు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న నౌకలను ఇరాన్ తీరం వైపు తరలించినట్లు సమాచారం.

ఈ చర్యను ఇరాన్ సమర్థించుకుంటూ, సదరు నౌకలు అంతర్జాతీయ సముద్ర నిబంధనలను ఉల్లంఘించాయని ఆరోపించింది. అవి తమ అనుమతి లేకుండా జలసంధి గుండా వెళ్తూ, నావిగేషన్ సిస్టమ్‌లను తారుమారు చేయడం ద్వారా సముద్ర భద్రతకు ముప్పు కలిగించాయని ఇరాన్ పేర్కొంది. IRGC విడుదల చేసిన వీడియోలో.. వారి స్పీడ్‌బోట్లు నౌకలను చుట్టుముట్టి కమెండోలు నౌకలపైకి ఎక్కిన దృశ్యాలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీజ్‌ఫైర్ పొడిగింపును ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే ఇరాన్ ఈ దాడులకు పాల్పడటం గమనార్హం. వీడియో

Next Story