ఇరాన్ సంక్షోభం: పోర్టుల్లోనే చిక్కుకుపోయిన రూ. 2 వేల కోట్ల బాస్మతి బియ్యం

by Malleboina Mahesh |   (  Updated:2026-01-10 03:43:04  IST  )

ఇరాన్‌లో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం , కరెన్సీ పతనం కారణంగా ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది.

ఇరాన్ సంక్షోభం: పోర్టుల్లోనే చిక్కుకుపోయిన రూ. 2 వేల కోట్ల బాస్మతి బియ్యం
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్‌లో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం , కరెన్సీ పతనం కారణంగా ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ ప్రభావం ఇతర దేశాల దిగుమతులపై పడింది. ముఖ్యంగా భారతీయ బాస్మతి బియ్యం ఎగుమతులపై ఇరాన్ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడి ప్రభుత్వం దిగుమతులపై ఆంక్షలు విధించడం, చెల్లింపుల విషయంలో అనిశ్చితి నెలకొనడంతో, భారత్ నుంచి ఎగుమతి కావలసిన సుమారు రూ. 2,000 కోట్ల విలువైన బాస్మతి బియ్యం ఇరాన్ పోర్టుల్లోనే నిలిచిపోయింది. ముఖ్యంగా ఇరాన్ కరెన్సీ (రియాల్) విలువ దారుణంగా పడిపోవడంతో, అక్కడి దిగుమతిదారులు చెల్లింపులు చేయలేక సతమతమవుతున్నారు. దీంతో ఎగుమతులు ఎక్కడికక్కడ స్తంభించిపోయి, భారతీయ ఎగుమతిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ పరిణామం ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైస్ మిల్లర్లపై కోలుకోలేని దెబ్బ తీసింది. దేశంలో బాస్మతి సాగు, ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించే ఈ రాష్ట్రాల మిల్లర్లు, తమ వద్ద ఉన్న నిల్వలు క్లియర్ కాక, కొత్త ఆర్డర్లు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోదాముల్లో నిల్వలు పేరుకుపోవడంతో పాటు, చేసిన ఎగుమతులకు డబ్బులు రాక వారి వ్యాపారం ప్రశ్నార్థకంలో పడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే బాస్మతి రైతులకు కూడా గిట్టుబాటు ధర లభించడం కష్టమవుతుందని వ్యాపార వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ రైతులు, వ్యాపారుల్లో నెలకొంది.

Read More..

సాంబా సెక్టార్‌లో పాక్ డ్రోన్ కలకలం.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Next Story