Breaking News : ఎయిర్ స్పేస్ మూసివేసిన ఇరాన్

by Muthe.Rajitha |

ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎయిర్‌స్పేస్‌ పూర్తిగా మూసివేసింది.

Breaking News : ఎయిర్ స్పేస్ మూసివేసిన ఇరాన్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎయిర్‌స్పేస్‌ పూర్తిగా మూసివేసింది. ఇరాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ జారీ చేసిన నోటామ్‌ ప్రకారం ఈ నిర్ణయం జనవరి 14 రాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. టెహ్రాన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్‌ పరిధిలోకి వచ్చే ఇరాన్ మొత్తం ఎయిర్ స్పేస్ లోని అన్ని రకాల విమానాల రాకపోకలను నిలిపివేశారు. సివిల్‌, మిలిటరీ, కార్గో, అలాగే ఇరాన్ మీదుగా దాటే ఓవర్‌ఫ్లైట్లకు కూడా పూర్తిగా నిషేధం విధించారు.

కేవలం ఇరాన్‌కు వచ్చే లేదా ఇరాన్‌ నుంచి వెళ్లే అంతర్జాతీయ సివిల్ ఫ్లైట్లకు మాత్రమే ముందుగా ఇరాన్ సీఏఏ అనుమతి తీసుకుంటే అనుమతిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదలపై ప్రజల నిరసనలు, అల్లర్లు చెలరేగడంతోపాటు, ఇంటర్నెట్‌ను పూర్తిగా నిలిపివేయడం వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థకు తీవ్ర ఆటంకాలు ఏర్పడటమేనని తెలుస్తోంది. దీనికితోడు ఇరాన్–అమెరికా మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో.. దేశ భద్రత కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ల ప్రకారం ప్రస్తుతం ఇరాన్ ఎయిర్‌స్పేస్‌లో కమర్షియల్ విమానాలు పూర్తిగా కనిపించడం లేదు. లుఫ్తాన్సా, ఎమిరేట్స్‌, ఖతార్ ఎయిర్వేస్‌, టర్కిష్ ఎయిర్లైన్స్‌, ఎయిర్ ఇండియా వంటి అనేక అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ తమ ఫ్లైట్లను రద్దు చేయడం లేదా దారిమళ్లించడం ప్రారంభించాయి.

Next Story