కువైట్ ఎయిర్పోర్ట్ మీద దాడి.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

by Muthe.Rajitha |   (  Updated:2026-03-25 09:26:30  IST  )

ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగాయి.

కువైట్ ఎయిర్పోర్ట్ మీద దాడి.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత భీకర స్థాయికి చేరాయి. ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగాయి. ఈ దాడుల్లో ప్రధానంగా విమానాశ్రయ ప్రాంగణంలోని జెట్ ఇంధన నిల్వ ట్యాంకులను (Jet Fuel Storage Tanks) డ్రోన్లు ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. సెకన్ల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయి, భారీగా మంటలు ఎగసిపడ్డాయి. కువైట్ రక్షణ వ్యవస్థలు కొన్ని డ్రోన్లను గాలిలోనే అడ్డుకున్నప్పటికీ, మరికొన్ని లక్ష్యాన్ని చేరడంతో భారీ నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, కేవలం ఆస్తి నష్టం మాత్రమే వాటిల్లిందని కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ధృవీకరించింది.

కువైట్ లో హై అలర్ట్

తాజా దాడి నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయాన్ని పాక్షికంగా మూసివేసి, అత్యవసర ప్రోటోకాల్స్‌ను అమలులోకి తెచ్చారు. గగనతల రక్షణ వ్యవస్థలను మరింత పటిష్టం చేసింది. స్థానిక ప్రజలు భారీ పేలుడు శబ్దాలతో ఆందోళనకు గురవ్వగా, ప్రభుత్వం సంయమనం పాటించాలని కోరింది. గల్ఫ్ దేశాలు తమ భద్రత కోసం అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరుతున్నాయి. యుద్ధం ముదురుతున్న కొద్దీ ఇరాన్ తన దాడుల పరిధిని పెంచుతుండటం, రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో మరిన్ని సంక్లిష్ట పరిస్థితులకు దారితీసేలా కనిపిస్తోంది.

వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ పై రష్యా భారీ ఎయిర్ అటాక్

Next Story