- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెతన్యాహు వల్లే చర్చలు విఫలం : ఇరాన్ ఆరోపణ
అమెరికా - ఇరాన్ చర్చల వైఫల్యానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహునే కారణమంటూ ఇరాన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఇస్లామాబాద్ వేదికగా అమెరికా - ఇరాన్ దేశాల మధ్య జరిగిన అత్యంత కీలకమైన చర్చలు విఫలం కావడంతో మధ్యప్రాచ్య రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. ఈ చర్చల వైఫల్యానికి ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహునే బాధ్యుడిని చేస్తూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి, పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగర్ ఘాలిబాఫ్‌ల వాదన ప్రకారం.. "ఈ ఒప్పందంలో లెబనాన్ యుద్ధం ఆపడం కూడా ఒక అంతర్భాగం, కానీ అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌ను, ముఖ్యంగా నెతన్యాహును అదుపు చేయలేకపోయింది, ఇది స్పష్టంగా కాల్పుల ఉల్లంఘనే" అనిమండిపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ కు మరోసారి తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు.
మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఆరోపణలను పూర్తిగా తిప్పికొట్టారు. "లెబనాన్ ఈ ఒప్పందంలో ఏమాత్రం భాగం కాదు, కాబట్టి హెజ్బొల్లాపై మా సైనిక కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి" అని ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో, చర్చలు విఫలం కావడంతో రెండు దేశాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే నెతన్యాహు తీసుకుంటున్న ఈ కఠిన వైఖరిపై ఇజ్రాయెల్ దేశీయంగా కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ వంటి వారు దీనిని "ప్రభుత్వ దౌత్య వైఫల్యం" (diplomatic failure) గా అభివర్ణిస్తూ ప్రధానిపై ఒత్తిడి పెంచుతున్నారు.






