- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదంలో జెన్ జీ... భారీగా తగ్గుతున్న IQ
జెన్ జీ గురించి జరిపిన ఓ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల కాలంలో జెన్ జీ గురించి జరిపిన ఓ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జెన్ జీ తరం యువతలో ఆలోచనా శక్తి, ఏకాగ్రత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం తగ్గుతోందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కొన్ని అంతర్జాతీయ అధ్యయనాలు, సర్వేలు చెబుతున్న విషయం ఏంటంటే.. ముందు తరాలతో పోలిస్తే జెన్ జీ తరంలో సగటు IQ స్థాయి క్రమంగా తగ్గుతున్నట్లు చెబుతున్నారు. ఇది ఒక్క దేశానికి పరిమితం కాదని.. అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సర్వే తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనలో పడేస్తోంది.
ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో అతిగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడటం అని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసు నుంచే మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, గేమ్స్‌లో మునిగిపోవడం వల్ల పిల్లల్లో చదవడం, లోతుగా ఆలోచించడం, సమస్యలను పరిష్కరించే ఆలోచన శక్తి తగ్గిపోతోందని అంటున్నారు. మిలీనియల్ జెనరేషన్ అంటే 90'స్ కిడ్స్ పుస్తకాలు బాగా చదివుతూ, ప్రశ్నలు అడుగుతూ, సొంతంగా ఆలోచిస్తూ సమస్యలను పరిష్కరించేవారని... ఇప్పుడు చాలామంది యువత విపరీతమైన సోషల్ మీడియా అడిక్షన్, ప్రతిదాన్ని ఆలోచించకుండానే నెట్లో చూసి తెలుసుకోవడానికి అలవాటయ్యారు. కిరాణా షాపుకు వెళ్తే కొనే సరుకుల లెక్కను కూడా మొబైల్ ద్వారా లెక్కిస్తున్నారని.. అసలు వీరికి వడ్డీ లెక్కలు అయితే అదొక మిస్టీరియస్ లెక్కలాగా చూస్తున్నారని ఉదహరిస్తున్నారు. దీని వల్ల ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి బలహీనపడటం, ఓపిక తగ్గడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
పరిశోధకులు చెబుతున్న మరొక ముఖ్యమైన కారణం చదువు విధానంలో వచ్చిన మార్పులు. మార్కులు, ర్యాంకులపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల నిజమైన అవగాహన, తార్కిక ఆలోచన తగ్గిపోతోందని హెచ్చరిస్తున్నారు. చాలా మంది విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవడం కన్నా కేవలం జ్ఞాపకం పెట్టుకొని పరీక్షలు రాస్తున్నారు. దీనివల్ల తాత్కాలికంగా మార్కులు రావచ్చు కానీ దీర్ఘకాలంలో ఆలోచనా శక్తి అభివృద్ధి కావడం లేదు. అలాగే శారీరక వ్యాయామం లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం కూడా మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
అయితే దీనిపై దిగులు పడాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పేరెంట్స్, టీచర్స్ నుంచి సరైన మార్గదర్శనం, మంచి అలవాట్లు ఉంటే జెన్ జీ తమ మేధస్సును పెంపొందించుకోగలదని చెబుతున్నారు. రోజూ కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయించడం, మొబైల్ వినియోగాన్ని తగ్గించడం, గ్రౌండ్లో ఆటలు ఆడడం, కంటి నిండా నిద్ర పోవడం వల్ల మెదడు చురుకుగా ఉంటుందని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుతూ, వారి ఆలోచనలను వినాలి. పాఠశాలలు కూడా కేవలం మార్కులకే కాకుండా ఆలోచించే శక్తిని పెంచే విద్యపై దృష్టి పెట్టాలి.
IQ విషయంలో జెన్ జీ ప్రమాదంలో ఉందన్న మాట భయపెట్టే విషయమే అయినా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే జెన్ జీ కేవలం టెక్నాలజీ కిడ్స్ మాత్రమే కాదు, బలమైన ఆలోచన శక్తి కలిగిన తరం గానూ నిలవగలదని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- Gen Z kids
- IQ






