- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ దేశంలో ఐపీఎల్ ప్రసారాలు బంద్.. కారణం అదే!
దిశ, వెబ్‌డెస్క్: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది.- Latest Telugu News

దిశ, వెబ్‌డెస్క్: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. క్రికెట్ ఆడే ప్రపంచదేశాలన్ని ఐపీఎల్‌ను ఆదరిస్తారు. అయితే, కరోనా తగ్గుముఖం పట్టడంతో.. ప్రేక్షకుల మధ్య విజయవంతగా సాగుతోన్న ఐపీఎల్ 15వ సీజన్‌కు శ్రీలంకలో షాక్ తగిలింది. కరోనా వల్ల ఆర్ధిక వ్యవస్థ భారీగా పతనమై కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ఐపీఎల్ ప్రసారాలు నిలిపివేశారు. ప్రసార హక్కుదారులకు చెల్లించేందుకు డబ్బులు లేవని.. శ్రీలంకలో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే ఎస్ఎల్ఆర్సీ, యుప్ టీవీ, పియో టీవీ, డయలాగ్ టీవీ ఛానల్‌లు క్యాష్ రిచ్ లీగ్ ప్రసారాలను నిలిపి వేశాయి. ఈ విషయాన్ని అక్కడి మీడియా వెల్లడించింది.
అయితే, శ్రీలంకలో పరిస్థితులు ఎంత దిగజారయంటే.. పరీక్షలకు కావలసిన పేపర్లు లేవని విద్యార్థులకు మొత్తానికే పరీక్షలు రద్దు చేశారు. ప్రింటింగ్ ప్రెస్‌లు దాదాపుగా బంద్ అయ్యాయి. నిత్యవసర సరుకుల ధరల ఆకాశన్నంటుతున్నాయి. ప్రపంచ దేశాల సహాయం కోసం శ్రీలంక ఎదురుచూస్తోంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థిలు అని ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. దీనితో ప్రభుత్వం శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించింది.






