గ్లామర్ బొమ్మగా ‘పెద్ది’ మూవీలో జాన్వీ కపూర్.. కెమెరా యాంగిల్స్‌పై ట్రోల్స్!

by Gantepaka Srikanth |

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన 'పెద్ద' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఒక అంశంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

గ్లామర్ బొమ్మగా ‘పెద్ది’ మూవీలో జాన్వీ కపూర్.. కెమెరా యాంగిల్స్‌పై ట్రోల్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన 'పెద్ద' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఒక అంశంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ (అచ్చియమ్మ) పాత్రను కేవలం 'గ్లామర్ బొమ్మ'గా చూపించారంటూ నెటిజన్లు చిత్రబృందంపై మండిపడుతున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా (X - ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్) వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఒక బలమైన సామాజిక అంశాన్ని చర్చించినప్పటికీ, హీరోయిన్ పాత్రకు మాత్రం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. కేవలం పురుషుల కోరికలను సంతృప్తి పరిచే గ్లామర్ పాత్రగా మాత్రమే ఆమెను పరిమితం చేశారని, కెమెరా యాంగిల్స్ కూడా చాలా అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఆ సీన్లపై దుమారం..

సినిమాలోని కొన్ని సన్నివేశాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హీరో.. హీరోయిన్ కళ్లను, పెదవులను పొగుడుతుంటే.. కెమెరా మాత్రం ఆమె శరీర భాగాలను ఫోకస్ చేయడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఎడిటర్‌కు కళ్లు, పెదవులకు, మిగతా శరీర భాగాలకు తేడా తెలియదా?" అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా, హీరోయిన్ ప్రమేయం (Consent) లేకుండా హీరో ముద్దు పెట్టుకునే సీన్లు, ఆమె ఏడుస్తున్నా కూడా బ్యాక్ గ్రౌండ్ రొమాంటిక్ మ్యూజిక్ ప్లే చేయడం వంటివి టాక్సిక్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. అసలు ఇలాంటి సీన్లను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి, 'పెద్ది' చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ, హీరోయిన్ పాత్రను చూపించిన విధానంపై వస్తున్న విమర్శలు మాత్రం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై చిత్రబృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.




Next Story