IPL 2026: టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్.. స్టార్ ప్లేయర్ దూరం

by Malleboina Mahesh |

సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్! ఉప్పల్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్. గాయం కారణంగా నితీష్ కుమార్ రెడ్డి దూరం కాగా, స్మరణ్ రవిచంద్రన్ అరంగేట్రం.

IPL 2026: టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్.. స్టార్ ప్లేయర్ దూరం
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా 45వ మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad,), కలకత్తా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆరెంజ్ ఆర్మీ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ జట్టు ఫీల్డింగ్ చేయనుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచులో గాయం కారణంగా తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి మ్యాచ్‌కి దూరం అయ్యాడు. అతని స్థానంలో మరో యువ ప్లేయర్ అయిన స్మరణ్ రవిచంద్రన్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అలాగే కేకేఆర్ జట్టులో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రమన్దీప్ స్థానంలో మనీష్ పాండేను తీసుకోగా ఫిన్ అలెన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ జట్టు, 8వ స్థానంలో ఉన్న కేకేఆర్ తో తలపడుతుండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగనుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్య రహానే(సి), అంగ్క్రిష్ రఘువంశీ(w), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్(సి), శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ

Next Story