- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మినీ బస్సు అద్దెకు టెండర్ దరఖాస్తుల ఆహ్వానం
బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఉపరితల గనికి యూనిట్ రేట్ సిస్టం ప్రకారం అద్దె ప్రాతిపదికన మినీ బస్సును సమకూర్చేందుకు టెండర్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జీఎం ఎం. శ్రీ రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఉపరితల గనికి యూనిట్ రేట్ సిస్టం ప్రకారం అద్దె ప్రాతిపదికన మినీ బస్సును సమకూర్చేందుకు టెండర్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జీఎం ఎం. శ్రీ రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండే 23+1 సీట్ల సామర్థ్యం గల నాన్-ఏసీ మినీ బస్సును నాలుగేళ్ల కాలపరిమితికి అద్దెకు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఆగస్టు 12వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు తమ దరఖాస్తులను బెల్లంపల్లి జీఎం కార్యాలయంలోని పర్చేస్ విభాగంలో సమర్పించాలని సూచించారు. టెండర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను జీఎం కార్యాలయంలోని పర్చేస్ విభాగంలో లేదా సింగరేణి సంస్థ వెబ్‌సైట్‌లో పొందవచ్చని జీఎం వెల్లడించారు.






