- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దిశ’ ఎఫెక్ట్.. ఐకేపీ బుక్‌కీపర్ అక్రమాలపై విచారణ షురూ
కారేపల్లి మండలం గంగారం తండాలో మహిళా సంఘాల పేరుతో తీసుకున్న రుణాల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

దిశ,కారేపల్లి: కారేపల్లి మండలం గంగారం తండాలో మహిళా సంఘాల పేరుతో తీసుకున్న రుణాల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సంఘ సభ్యుల అనుమతి లేకుండా ఫోర్జరీ సంతకాలతో రుణాలు పొందాలని ‘దిశ’ దినపత్రికలో శుక్రవారం ప్రచురణమైన కథనానికి ఐకేపీ మండల ఏపిఎం స్పందించారు. శనివారం ఐకేపీ బుక్‌కీపర్ ప్రసాద్‌పై విచారణ ప్రారంభమైంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఫిర్యాదుల మేరకు సీసీ పద్మ మరో ఇద్దరు సీసీలతో గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. పుష్ప, కస్తూరి డ్వాక్రా సంఘాల సభ్యుల పేర్లతో నకిలీ తీర్మానాలు రూపొందించి, కొందరు లీడర్ల సహకారంతో రూ.2 లక్షల వరకు రుణాలు డ్రా చేసేందుకు ప్రయత్నించినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు అధికారులు వెల్లడించారు. సభ్యుల అసలు సంతకాలతో తిరిగి తీర్మానాలు సమర్పించాలని ఉన్నతాధికారులు సూచించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. సంఘ సభ్యులు తమకు తెలియకుండానే రుణ ప్రక్రియలు నిర్వహించారని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు విచారణ బృందం తెలిపింది. ఫోర్జరీ చేసిన బుక్‌కీపర్‌తో పాటు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.






