- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలు అన్ని రంగాల్లో రాణించడం మంచి పరిణామం: లక్ష్మణ్
by S Gopi |
దిశ, ముషీరాబాద్: గోల్కొండ చౌరస్తాలోని ఓ హోటల్ లో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్..International Women's Day celebrations in Mushirabad

X
దిశ, ముషీరాబాద్: గోల్కొండ చౌరస్తాలోని ఓ హోటల్ లో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మణ్ హాజరై ముషీరాబాద్, హిమాయత్ నగర్ తహశీల్దార్లు జానకి, లలిత, వివిధ రంగాల ప్రముఖులు ఎ.వాణిశ్రీ, రత్నారాణి, పద్మ కమలాకర్, బాలలత, దీపికారెడ్డి, స్వర్ణలత పురస్కారాలు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం మంచి పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎ.వినయ్ కుమార్, రత్నసాయిచంద్, ఉమేశ్, ప్రఫుల్ పద్మజారాంరెడ్డి, లక్ష్మి, సంయుక్తరాణి, ఆనంద్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






