పాకిస్తాన్ మద్దతుతో నడుస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

by Malleboina Mahesh |

"పంజాబ్‌లో అంతర్జాతీయ నార్కో-టెర్రర్ ముఠా.. 4.8kg హెరాయిన్, తుపాకీతో పాటు ఆరుగురిని అరెస్ట్ చేసిన ఫరీద్‌కోట్ పోలీసులు. పాక్ మద్దతుతో డ్రగ్స్ మాఫియా."

పాకిస్తాన్ మద్దతుతో నడుస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
X

దిశ. వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ మద్దతుతో నడుస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పంజాబ్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న అంతర్జాతీయ నార్కో-టెర్రర్ మాడ్యూల్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పాకిస్థాన్ మద్దతుతో నడుస్తున్న ఒక భారీ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను ఫరీద్‌కోట్ పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా నిందితుల నుండి 4.804 కిలోల హెరాయిన్, ఒక 30 బోర్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణాకు ఉపయోగిస్తున్న థార్, XUV 500 వంటి విలాసవంతమైన వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఫరీద్‌కోట్ ఎస్ఎస్పీ (SSP) ప్రజ్ఞా జైన్ మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా డ్రగ్స్ నిర్మూలన కోసం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో ఇది అతిపెద్ద విజయమని ఆమె పేర్కొన్నారు. ఈ ముఠా వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని, ఇది కేవలం డ్రగ్స్ అక్రమ రవాణా మాత్రమే కాకుండా దేశ భద్రతకు ముప్పు కలిగించే అంతర్జాతీయ నార్కో-టెర్రర్ మాడ్యూల్ అని ఆమె స్పష్టం చేశారు. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, దీని వెనుక ఉన్న మిగతా వ్యక్తులను కూడా త్వరలోనే పట్టుకుంటామని ఆమె తెలిపారు.

Next Story