- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, సిర్పూర్(టి): కుటుంబ సభ్యులు మందలించారని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్(టి) మండలం బెంగాలీ క్యాంపునకు చెందిన రాఖీ టేకిదర్(16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. బుధవారం సాయంత్రం బాలిక పెద్దనాన్న కాలేజీ నుండి తీసుకురావడానికి వెళ్లేసరికి అక్కడ లేకపోయేసరికి కంగారుగా ఇంటికి వెళుతుండగా బాలిక అతని వెనుకాల నడుచుకుంటూ వెళ్లింది. ఇంట్లో ఈ విషయమై మందలించేసరికి మనస్తాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగులమందు తాగింది. ఇంట్లోవాళ్ళు గమనించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు.
Next Story






