వృద్ధులకు ఆసరాగా హెల్ప్ ఏజ్.. నివేదికలో వెలుగు చూసిన ఆసక్తికర అంశాలు

by Jakkula.Mamatha |

వృద్ధుల జీవన విధానంపై హెల్ప్ ఏజ్ ఇండియా ఈ ఏడాది విడుదల చేసిన జాతీయ నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది.

వృద్ధులకు ఆసరాగా హెల్ప్ ఏజ్.. నివేదికలో వెలుగు చూసిన ఆసక్తికర అంశాలు
X

దిశ, హిమాయత్ నగర్: వృద్ధుల జీవన విధానంపై హెల్ప్ ఏజ్ ఇండియా ఈ ఏడాది విడుదల చేసిన జాతీయ నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. అనువైన జీవనం కోసం ఎక్కువ శాతం మంది వృద్ధులు సంరక్షకులపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంది. 10 రాష్ట్రాల్లోని 20 ముఖ్యమైన జిల్లాల్లో 2224 వృద్ధులపై అధ్యయనం చేసింది. వృద్ధుల సంరక్షణ అవసరాలు 30% మందికి మంచం ఎక్కడానికి, దిగడానికి సహాయం అందిస్తున్నారు. 27% మందికి స్నానం, వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో మద్దతు అవసరం అని నివేదించింది.

67% మందికి రవాణాలో, 64% మందికి డబ్బు నిర్వహణలో, 63% మందికి షాపింగ్‌లో, 61% మందికి ఫోన్ వాడకంలో సహాయం అవసరం అందిస్తున్నట్లు సర్వే నివేదికలో వెల్లడైంది. 94% మంది కుటుంబ సభ్యుల నుంచి సంరక్షణ పొందుతున్నారు. ఇందులో జీవిత భాగస్వామి (30%), కుమారులు (31%), కోడళ్లు (17%) సహకారం అందిస్తున్నారు. 69% మంది సంరక్షణ పొందడంలో కనీసం ఒక సవాలును ఎదుర్కొంటున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు అత్యధిక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. వీరిలో 52% మంది సంరక్షకులు అందుబాటులో లేరని, 17% మంది నిర్లక్ష్యానికి గురవుతున్నారు.

ఆరోగ్య సమస్యలు..

చేతులు, పాదాల్లో నొప్పి, తలనొప్పి తో పాటు రక్తపోటు పెరుగుతోందని నివేదించారు. 7% మంది కుంగుబాటు, ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారు. 78% మంది వృద్ధులు మూడేళ్లలో కనీసం ఒక వాతావరణ సంబంధిత ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. వడగాలులు (45%), వరదలు (27%) కరువు (20%) అత్యంత సాధారణ ప్రమాదాలుగా ఉన్నాయి. వయోవృద్ధుల సంరక్షణపై 48 ఏళ్లుగా హెల్ప్‌ఏజ్ ఇండియా పనిచేస్తోంది. భవిష్యత్ తరాలకు పెద్దల గొప్పతనాన్ని వివరిస్తూ... విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తోందని సంస్థ తెలంగాణ, ఏపీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యామ్ కుమార్ వెల్లడించారు.

Next Story