- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుల వివక్షకు చెక్ పెట్టాలంటే ' కులాంతర వివాహాలే' మార్గం: మోహన్ భాగవత్
దేశంలో కుల వివక్షను రూపుమాపాలంటే అంతర్-కుల వివాహాలను సమర్థించాలని మోహన్ భాగవత్ కోరారు. సమాజంలో మార్పు రావాలంటే కుల ప్రాతిపదికన ఉన్న విద్వేషాలను వీడాలని ఆయన పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: కుల వివక్ష నిర్మూలన పై ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వివక్షకు చరమగీతం పాడాలంటే కులాంతర వివాహాలను (Inter-Caste Marriages) ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక సమరసత సాధించడమే లక్ష్యంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
కుల వివక్ష అనేది ఒక సామాజిక రుగ్మత అని, దానిని తొలగించడానికి కేవలం మాటలు సరిపోవని మోహన్ భగవత్ (Mohan Bhagwat) అభిప్రాయపడ్డారు. వివిధ కులాల మధ్య సాన్నిహిత్యం పెరగాలంటే కుటుంబాల మధ్య బాంధవ్యాలు ఏర్పడాలని, అందుకు కులాంతర వివాహాలు ఒక శక్తివంతమైన మార్గమని ఆయన పేర్కొన్నారు. హిందూ సమాజం ఐక్యంగా ఉండాలంటే కులాల వారీగా ఉన్న అడ్డుగోడలు కూలిపోవాలని, అప్పుడే దేశం బలోపేతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా ఇటువంటి వివాహాలను చేసుకునే జంటలకు సమాజం అండగా నిలవాలని ఆయన కోరారు.






