- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandi Sanjay: యాదాద్రి లో బండి సంజయ్ కి చుక్కెదురు
దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రిలో కొండపైకి వేళ్ళే ఘాట్ రోడ్డు వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజాయ్‌కి

దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రిలో కొండపైకి వేళ్ళే ఘాట్ రోడ్డు వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజాయ్‌కి చుక్కెదురైంది. లక్ష్మీ నరసింహ స్వామిని బుధవారం దర్శించుకోవడానికి వెళుతున్న ఆయన కాన్వాయ్ ని 15 నిమిషాల పాటు పోలీసులు ఆపారు. దీంతో బీజేపీ నేతలు ఆలయ నిర్వహణ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఇది సీఎం కేసీఆర్ గుడినా లేదా భక్తుల గుడినా అని నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని వదిలి పెట్టారు.
అనంతరం బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, పివి.శ్యామసుందర్ రావును అర్చకులు స్వతివాచనంతో ప్రత్యేక ఘన స్వాగతం పలికారు. వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్, సుగుణాకర్, నరేందర్, రచ్చ శ్రీనివాస్, రాష్ట్ర విభాగం బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






