- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో భారత జాతీయ జెండాకు ఘోర అవమానం
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హల్ వద్ద క్లేటన్ వాకర్ అనే వ్యక్తి భారత జాతీయ జెండాను చించి, ఘోర అవమానం చేసాడు.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో భారత జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్ ఫ్రిస్కో సిటీ హాల్ వెలుపల క్లేటన్ వాకర్ అనే వ్యక్తి భారత జాతీయ జెండాను బహిరంగంగా చించివేస్తూ తీవ్రంగా అవమానించాడు. అంతేకాకుండా భారతదేశాన్ని ఉద్దేశించి అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. ఈ చర్యను చూసి చుట్టూ ఉన్న ఇతర నిరసనకారులు చప్పట్లు కొడుతూ, కేకలు వేస్తూ ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ ఘటనను వీడియో మరో ఇన్‌ఫ్లూయెన్సర్ ఎలిజా షాఫర్ షేర్ చేయడంతో ఇది క్షణాల్లో అంతర్జాతీయంగా వైరల్ అయ్యింది. అమెరికాలో పెరుగుతున్న హెచ్-1బీ (H-1B) వీసాలు, భారతీయ వలసదారులకు వ్యతిరేకంగా టెక్సాస్‌లో కొంతకాలంగా యాంటీ-ఇమిగ్రేషన్ గ్రూపులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. ఫ్రిస్కో నగరంలో ఇటీవలి కాలంలో భారతీయుల జనాభా గణనీయంగా పెరగడం వల్ల స్థానికంగా ఉద్యోగ అవకాశాలు, హౌసింగ్ వంటి రంగాలపై ఒత్తిడి పెరుగుతోందని సదరు నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా వలస విధానాలు, ఉద్యోగ సమస్యలపై శాంతియుతంగా చర్చలు జరపడాన్ని కొందరు సమర్థించినప్పటికీ, ఒక దేశ జాతీయ జెండాను ఈ విధంగా అవమానించడాన్ని ఎవరూ అంగీకరించడం లేదు. అమెరికాలోని భారతీయ-అమెరికన్ కమ్యూనిటీతో పాటు ఎన్‌ఆర్‌ఐ (NRI) సంఘాలు ఈ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించాయి. ఇది ముమ్మాటికీ భారతీయులపై జరుగుతున్న జాతి వివక్ష మరియు ద్వేషపూరిత చర్యే అని మండిపడుతున్నారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తిపై స్థానిక చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.






