- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సబ్‌స్టేషన్‌లో 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు
నిజాంసాగర్ మండల కేంద్రంలోని 33/11 కేవీ అచ్చంపేట పరిధిలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సోమవారం నిర్వహణ, అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ లైన్‌మన్ షేర్ అలీ తెలిపారు.

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని 33/11 కేవీ అచ్చంపేట పరిధిలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సోమవారం నిర్వహణ, అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ లైన్‌మన్ షేర్ అలీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో అధిక సామర్థ్యం కలిగిన 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పనుల నేపథ్యంలో సోమవారం రోజంతా సబ్‌స్టేషన్ పరిధిలోని నిజాంసాగర్, సుల్తాన్‌నగర్, మాగి, గోర్గల్, అచ్చంపేట, లింగంపల్లి, మర్పల్లి, ఆరేపల్లి, ఆరేడు, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని తెలిపారు. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించాలని, వ్యవసాయానికి అందించే త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు తమ వ్యవసాయ పనులను దీనికి అనుగుణంగా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
విద్యుత్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భవిష్యత్తులో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో ఈ ట్రాన్స్‌ఫార్మర్ మార్పిడి పనులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అందువల్ల ఒక రోజు పాటు విద్యుత్ అంతరాయాన్ని సహనంతో స్వీకరించి, నిర్వహణ పనులు విజయవంతంగా పూర్తయ్యేలా రైతులు, విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖకు పూర్తి సహకారం అందించాలని విద్యుత్ శాఖ లైన్‌మన్ షేర్ అలీ విజ్ఞప్తి చేశారు.






