ఇన్‌స్టాలో సరికొత్త ఫీచర్.. ఇక వారిపై పూర్తి నిఘా

by Disha Web Desk 19 |
ఇన్‌స్టాలో సరికొత్త ఫీచర్.. ఇక వారిపై పూర్తి నిఘా
X

దిశ, ఫీచర్స్: ఇన్‌స్టాగ్రామ్ వినియోగంతో యూత్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారనే ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అందుకే పేరెంట్ కంపెనీ మెటా తమ ఫొటో-షేరింగ్ యాప్‌లో పిల్లల యాక్టివిటీని తల్లిదండ్రులు పర్యవేక్షించేందుకు గాను సరికొత్త ఫీచర్స్ రిలీజ్ చేసింది. ఇంతకీ ఈ ఫీచర్స్‌ స్పెషాలిటీ ఏంటీ? చిల్డ్రన్స్, టీనేజర్స్‌ ఈ యాప్‌కు బానిసై, బలికాకుండా ఎంతమేర ఉపయోగపడనుంది?? తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇన్‌స్టాను వాడుతుండగా.. ఇందులోని ఫిల్టరింగ్ ఫీచర్స్‌ యువతపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా అందులో ఉన్న మోడల్ షేప్‌లో తాము లేమని, అంత అందంగా కనిపించేందుకు ఏమి చేయాలనే ఆలోచనలు మానసిక అనారోగ్యానికి కారణమవుతున్నాయని ఫేస్‌బుక్ ఒప్పుకుంది. తద్వారా సూసైడ్ టెండెన్సీస్‌ కూడా పెరిగిపోయాయనే విషయాన్ని నిర్ధారించారు నిపుణులు. ఈ విమర్శలతో చిన్నారులు, టీనేజర్స్ ఇన్‌స్టా వినియోగాన్ని పేరెంట్స్ నియంత్రించేలా సూపర్ విజన్ టూల్ డెవలప్ చేసింది. 'ఈ ప్లాట్‌ఫామ్‌లో పిల్లలు ఎంత సేపు గడుపుతున్నారు.. ఎవరెవరిని ఫాలో అవుతున్నారు.. ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు..' అనే విషయాలను పేరెంట్స్ పర్యవేక్షించేలా ఈ టూల్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లోని తల్లిదండ్రులకు అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త ఫీచర్.. రాబోయే కొన్ని నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మెటా పేర్కొంది.



Next Story