- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మౌలిక సదుపాయాల పై ఫోకస్.. సత్తుపల్లిలో అభివృద్ధి పనుల తనిఖీ
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో వేంసూర్ రోడ్డు నందు క్రిస్టియన్ భవన్ నిర్మాణం కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ పరిశీలించారు.

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో వేంసూర్ రోడ్డు నందు క్రిస్టియన్ భవన్ నిర్మాణం కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన సూచనలు చేశారు. అనంతరం పట్టణంలోని బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారి నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






