- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూటమి ప్రభుత్వంలో జనసేనకు అన్యాయం.. బొలిశెట్టి సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్
కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న జనసేన (Janasena) పార్టీకి పదవుల విషయంలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆ పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetty Satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న జనసేన (Janasena) పార్టీకి పదవుల విషయంలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆ పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetty Satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ఏర్పాటు సమయంలో కుదిరిన ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని, క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పదవుల పంపకంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కుదిరిన 60-30-10 శాతం నిష్పత్తి ఫార్ములా ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. అధికారం కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన జనసేన సైనికులకు నామినేటెడ్ పదవుల విషయంలో మొండిచేయి ఎదురవుతోందని ఆయన మండిపడ్డారు.
ముఖ్యంగా దేవాలయ కమిటీల నియామకాల్లో జనసేనను పూర్తిగా విస్మరించారని బొలిశెట్టి ధ్వజమెత్తారు. విశాఖ ఈస్ట్ నియోజకవర్గ పరిధిలోన ఐదు దేవాలయాలకు కమిటీలను ప్రకటించగా అందులో ఒక్క కమిటీలోనూ కూడా జనసేన కార్యకర్తకు చోటు కల్పించలేదన్నారు.. కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి, టీడీపీ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కూటమి గెలుపు కోసం రక్తం చిందించిన కార్యకర్తలకు నేడు అన్యాయం జరుగుతోందని.. విశాఖ ఈస్ట్‌లో ఒక్క దేవాలయ కమిటీ కూడా ఇవ్వకపోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. పదవుల విషయంతో తమ వాటా తమకు దక్కాల్సిందేనని బొలిశెట్టి చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.






