- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనాలీలో ఇన్‌ఫ్లుయెన్సర్ బికీనీ డ్యాన్స్.. వ్యక్తిగత స్వేచ్ఛvs సంస్కృతిగా మారిన వివాదం
హిమాచల్ ప్రదేశ్‌లో గత వారం రోజులుగా మంచు భారీగా కురుస్తుండటంతో పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లో గత వారం రోజులుగా మంచు భారీగా కురుస్తుండటంతో పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో మనాలీలోని ఓ పర్యాటక కేంద్ర వద్ద ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ బికీనీ ధరించి డ్యాన్స్ (Influencer Bikini Dance) చేసిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పాటు పెద్ద వివాదానికి తెరలేపింది. పవిత్రమైన హిమాలయ సానువుల్లో, స్థానిక సంప్రదాయాలకు నిలయమైన ఇలాంటి ప్రదేశాల్లో ఇలాంటి చర్యలు అగౌరవమని కొందరు విమర్శిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల పట్ల కనీస మర్యాద పాటించాలని, సంస్కృతిని కించపరిచేలా వ్యవహరించడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ చర్యను సమర్థించే వారు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు, స్వీయ వ్యక్తీకరణకు (Self-expression) సంబంధించిన అంశమని వారు వాదిస్తున్నారు. ఒక వ్యక్తి ఏ దుస్తులు ధరించాలి, ఎలా డాన్స్ చేయాలి అనేది వారి ఇష్టమని, దీనిని సంస్కృతితో ముడిపెట్టడం సరికాదని మద్దతుదారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై ఆన్‌లైన్ వేదికగా సంస్కృతి వర్సెస్ వ్యక్తిగత స్వేచ్ఛ అనే కోణంలో తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగుతోంది.






