ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

by Jakkula.Mamatha |

మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బుధవారం అధికారులు ఎత్తివేయడంతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతుంది.

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
X

దిశ, మోర్తాడ్: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బుధవారం అధికారులు ఎత్తివేయడంతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతుంది. బాబ్లీ ప్రాజెక్టు నుంచి గడిచిన 24గంటల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు 2894 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని, ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ, ఇతర అవసరాల నిమిత్తం 817 క్యూసెక్కుల అవుట్ ఫ్లో జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.501టీఎంసీలకు గాను తాజాగా 15.274 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

Next Story