ఘోర ప్రమాదం: క్వారీలో కూలిన భారీ బండరాయి.. ఏడుగురు కార్మికులు దుర్మరణం!

by Malleboina Mahesh |

బెంగళూరు క్వారీలో కుప్పకూలిన భారీ బండరాయి.. కిందపడి నలిగిపోయి ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం!

ఘోర ప్రమాదం: క్వారీలో కూలిన భారీ బండరాయి.. ఏడుగురు కార్మికులు దుర్మరణం!
X

దిశ, వెబ్ డెస్క్: క్వారీలో పని చేస్తున్న కర్మీకులపై భారీ బండరాయి పడిపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగర శివార్లలో చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ క్రషర్/రాయి క్వారీ (Stone Quarry) లో పనులు జరుగుతుండగా, ఒక్కసారిగా ఎగువ భాగం నుంచి భారీ బండరాయి కింద పనిచేస్తున్న కార్మికులపై విరిగిపడింది. ఈ ఊహించని ప్రమాదంలో బండరాయి కింద నలిగిపోయి ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, విపత్తు నిర్వహణ (NDRF/SDRF) సిబ్బంది, ఫైర్ ఫైటర్లు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని భారీ క్రేన్ల సహాయంతో బండరాళ్లను తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా ఇతర రాష్ట్రాలు, ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన వలస కూలీలుగా అనుమానిస్తున్నారు. క్వారీ యాజమాన్యం కనీస రక్షణ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద స్థలంలో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది

Next Story